Badrachalam full information



భద్రాచలం - శ్రీరాముడి ప్రదేశం





భారత దేశపు దక్షిణ భాగం లో తెలంగాణ రాష్ట్రం లోని ఖమ్మం జిల్లాలో భద్రాచలం ఒక చిన్న గ్రామం. ఈ పట్టణం హైదరాబాద్ నగరానికి సుమారు 309 కి. మీ.ల దూరం లో వుంటుంది. భారత దేశం లో ఇది ఈశాన్య భాగం మరియు గోదావరి నది ఒడ్డున కలదు. ఈ ప్రాంతం శ్రీరాముడు మరియు ఆయన సాధ్వి సీతా నివసించిన ప్రదేశం గా దెస వ్యాప్తంగా ప్రసిద్ధి చెందినది. ఇది శ్రీరాముడు నివసించిన ప్రదేశం కనుక హిందూ యాత్రికులు దీనిని ఎంతో పవిత్ర భూమిగా భావిస్తారు. రాముడి పేరు చెపితే చాలు ఆంధ్రులకు భద్రాచలం గుర్తుకు వస్తుంది.


ఈ పట్టణానికి భద్రాచలం అనే పేరు భద్ర గిరి నుండి వచ్చింది. భద్ర అంటే ఒక వరం కారణంగా మేరు కు మేనకకు పుట్టిన బిడ్డ అని చెపుతారు. రాముడి భక్తులకు అయోధ్య తర్వాత భద్రాచలం రెండవ స్థలం గా భావిస్తారు. లంక లో రావణుడిని వధించిన తర్వాత రాముడు చాలా కాలం పరిపాలన చేసాడు.

భద్రాచలం గురించిన ఇతిహాస గాధలు

భద్రాచలం ఒకప్పుడు దండకారణ్యం లో భాగం గా వుండేది. రాముడు తన వనవాసం సమయంలో సీతా మరియు లక్ష్మణుల తో కలిసి ఇక్కడ కొంత కాలం నివసించాడు. వారు నివసించిన ప్రదేశం దేవాలయం నుండి సుమారు 32 కి. మీ. ల దూరం లో వుంటుంది. శ్రీరాముడు ఇక్కడ తన కుటుంబం కొరకు నివాసాన్ని నిర్మించాడు. ఆయన నిర్మించిన గుడిసె నుండే రావణుడు సీత ని లంక కు అపహరించుకు పోయాడని చెపుతారు.
మరో కధ గా విష్ణు భక్తుడైన భద్రుడు ఒక రుషి. రాముడు అంటే తెగ ఇష్టపడతాడు. రాముడు లంక కు వెళ్ళే సమయం లో ఈ రుషి ని కలిసి ఆయన నుండి ఆతిధ్యం పొందేందుకు తాను మరల సీత తో తిరిగి వస్తానని చెపుతాడు. కాని ఆయన తిరిగి రాక పోవటం తో భద్రుడు అనే ఆ రుషి ఎంతో కాలం ఎదురు చూస్తాడు. తన భక్తుడు భద్రుడి ఎదురు తేన్నులకు మెచ్చిన విష్ణుమూర్తి, తానే రాముడి అవతారం లో , సీతా మరియు లక్ష్మణుడి తో కలసి దర్శనమిస్తాడు. ఈ సంఘటన రామ రాజ్యం బుగిసిన చాలా కాలానికి జరుగుతుంది. రాముడి భక్తుడైన భద్రుడి పేరుపై పట్టణం భద్రాచలం గా పిలువబడుతుంది.
మరో కధ గా శ్రీరాముడు పాకాల దమ్మక్క అనే మహిళకు కలలలో కనపడి, భద్రగిరి కొండల పై విగ్రహాలు కలవని చెప్పాడని, మరుసటి రోజు ఆమె ఆ కొండ పై కొన్ని విగ్రహాలను చూచిందని, వాటి తో ఆమె ఒక చిన్న దేవాలయం ఏర్పాటు చేసి ఆ విగ్రహాలని పూజించిందని, తర్వాతి కాలం లో ఆ ప్రదేశం భద్రాచలం గా పిలువబడుతూవే లాది భక్తుల చే పూజించాబడుతూ వారి పాపాలని నసింప చేస్తోందని చెపుతారు.
ప్రకృతి దృశ్యాల మధురానుభూతులు
భద్రాచలం పర్యాటకులకు ఎన్నో సుందర దృశ్యాల అనుభవాలని కలిగిస్తుంది. ప్రధానంగా, ఇక్కడ జటాయు పక్క, పర్ణశాల, దుమ్ముగూడెం, గుణదల కలవు. రెండు ఖ్యాతి గాంచిన దేవాలయాలు అంటే శ్రీ సీతా రామచంద్ర స్వామి గుడి మరియు భద్రాచల రాముడి గుడి కలవు. ప్రతి సంవత్సరం వేలాది పర్యాటకులు ఈ ప్రదేశాన్ని సందర్శిస్తారు. రోడ్డు లేదా రైలు మార్గాలలో భద్రాచలం తేలికగా చేరవచ్చు.

Comments