తెలంగాణా రాష్ట్ర పర్యటన
నిజాముల పాలనలో తెలంగాణా ప్రాంతం , మెదక్ మరియు వరంగల్ డివిజన్ లు కల హైదరా బాద్ రాష్ట్రానికి చెందినదిగా వుండేది. తర్వాత అది ఆంద్ర ప్రదేశ్ లో ఒక భాగం అయ్యింది. జూన్ 2 వ తేదీ 2014 సంవత్సరం నాడు తెలంగాణా ఒక ప్రత్యేక రాష్ట్రం గా ఆవిర్భ వించింది. హైదరాబాద్ నగరం తెలంగాణాకు రాజధానిగా కొనసాగుతోంది.
తెలంగాణ రాష్ట్ర సరిహద్దులు
తెలంగాణ రాష్ట్ర సరిహద్దులు ఉత్తరం మరియు వాయువ్య దిశలలో మహారాష్ట్ర తోను ఈశాన్యంలో చత్తీస్ ఘర్ రాష్ట్రంతోను, పడమర లో కర్నాటక తోను, తూర్పు వైపు ఓడిశా తోను పంచుకుంటాయి. ఈ రాష్ట్రానికి ఆ పేరు ఎలా వచ్చించి ? తెలంగాణా అనే పేరు, రాష్ట్రంలో విస్తృతంగా మాట్లాడే తెలుగు భాష నుండి ఏర్పడి నట్లు భావిస్తారు. మాజీ హైదరాబాద్ రాష్ట్రం లో మిగిలిన భాగంలో మరాఠి మాట్లాడు ప్రజలు వుండి తెలంగాణా కు ఒక ప్రత్యేకతను కల్పించారు. వీరి సంస్కృతి ఎలా ? తెలంగాణ ప్రజలు భారత దేశపు వివిధ సంప్రదాయాలతో పాటు ఇతర దేశాలైన పర్షియా సంస్క్రతి ప్రభావాలు కూడా కనపడతాయి. ఈ రాష్ట్రం వివిధ సంస్కృతుల ప్రభావం కలిగి వుండటం ఒక ప్రత్యేకత. తెలంగాణా దక్షినాది రాష్ట్రం అయినప్పటికీ, ఉత్తర భారత దేశపు హోలీ వంటి కొన్ని పండుగలు ఇక్కడ ఘనంగా జరుప బడతాయి.
తెలంగాణ - సాంస్కృతిక రంగం
బమ్మెర పోతన (శ్రీమద్ భాగవత తెలుగు అనువాదకులు) వంటి ప్రసిద్ధ రచయితలు, కవులు, ఇతర కళాకారులు ఈ రాష్ట్రానికి పేరు తెచ్చారు. తెలంగాణా లో కల కొన్ని ప్రాంతీయ పండుగలలో బోనాలు, బతుకమ్మ మరియు సమ్మక్క సారాలమ్మ జాతర వంటివి ప్రసిద్ధి. దసరా, గణేష్ చతుర్ధి, ఉగాది వంటి పండుగలు కూడా ఇక్కడి ప్రజలు వైభవోపేతంగా ఆచరిస్తారు. రాష్ట్రంలోని ఆహారాలు ఏమిటి? తెలంగాణా లో రెండు రకాల ఆహారాలు కలవు. తెలుగు వంటకాలు మరియు హైదరాబాద్ వంటకాలు.
తెలంగాణ - ఆహారాలు
తెలుగు వంటలు వివిధ సుగంధ ద్రవ్యాల ఘాటైన రుచుల వంటలు కాగా, హైదరాబాద్ వంటకాలు లో తెలుగు మరియు ఇతర దేశాలు అంటే అరబ్, టర్కిష్, మరియు మొగలాయీ వంటకాల సమ్మేళనం రుచులు కలిగి వుంటాయి. తెలంగాణ లో టూరిజం దక్షిణ భారత దేశంలో తరచుగా పర్యటించే ప్రదేశాలు తెలంగాణా లో కలవు. హైదరాబాద్ లోని చార్మినార్, హుస్సేన్ సాగర్, బిర్లా మందిర్ మరియు కుంతల వాటర్ ఫాల్స్ , వరంగల్ లోని యాదగిరి గుట్ట, బాసర లోని సరస్వతీ దేవాలయం వంటివి వాటిలో కొన్ని. ఈ రాష్ట్రంలో ఇంకనూ భద్రాచలం టెంపుల్, వేయి స్తంభాల టెంపుల్, శ్రీ రాజ రాజేశ్వర స్వామీ టెంపుల్ వంటివి కూడా కలవు.
తెలంగాణ - రవాణా సదుపాయాలు
రాష్ట్రం లో రవాణా వ్యవస్థ ఎలా వుంటుంది? రాష్ట్రంలోని రవాణా వ్యవస్థ పర్యాటకులకు సౌకర్యవంతంగా వుండి ఇండియా లోని ఇతర రాష్ట్రాల నుండే కాక, ఇతర దేశాల వారు కూడా తేలికగా పర్యటనలు చేసేది గా వుంటుంది. హైదరాబాద్ లోని రాజీవ్ గాంధి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ దేశంలోని ఇతర రాష్ట్రాల పర్యాట కులకే కాక, ఇతర దేశాల విమాన సర్వీస్ లకు కలుపబడి వుంది. రైల్వే మరియు రోడ్డు మార్గాలు కూడా రాష్ట్రంలోని వివిధ ప్రదేశాలు పర్యటించేందుకు అనుకూలంగా వుంటాయి.
Telangana New Map
TS state in INDIA map
Comments
Post a Comment