Telangana Attractions Nallagonda full view


నల్గొండ – దివ్యమైన గతం, వర్తమాన౦  !!



నల్గొండ, తెలంగాణ  లోని నల్గొండ జిల్లలో ఒక మునిసిపల్ పట్టణం. ఈ పట్టణం పేరు రెండు తెలుగు పదాలు నల్ల, కొండల కలయిక, అంటే నలుపు రంగు, కొండ అని అర్ధం. అందుకని స్థానిక భాషలో ఈ పట్టణానికి నల్ల కొండ అని అర్ధం. ప్రారంభంలో ఈ నల్గొండ ప్రాంతం నీలగిరి అని పిలిచేవారు. బహామనీల కాలంలో ఈ పట్టణాన్ని నల్లగొండ అని మార్చారు. నిజాం పాలనా కాలంలో  అధికారిక అవసరాలకు ఈ పేరును నల్గొండ గా పలికేవారు. అయితే, స్థానికులు ఇప్పుడు కూడా ఈ ప్రాంతాన్ని నల్లగొండ గానే పిలుస్తారు. ఈ ప్రాంతం అనేక రచనలలో పైగా ప్రసిద్ధ తెలంగాణా విమోచన పోరాట కవిత్వంలో కూడా ఇలాగే పలుకుతున్నారు. చాల మంది ప్రజలు ఈ ప్రాంతాన్ని అధికారిక పత్రాలలో కూడా ఇలాగే పలకాలనే అభిప్రాయాన్ని వ్యక్త పరుస్తున్నారు.


తెలంగాణా ఉద్యమం ప్రధాన౦గా నల్లగొండ, వరంగల్ జిల్లాల చుట్టు తిరుగుతున్నందువలన ఈ ఉద్యమంలో నల్గొండ ఒక కీలక భాగమైంది. దాదాపు ఈ రెండు జిల్లాలోని అన్ని పట్టణాలు, గ్రామాలు తెలంగాణా ఉద్యమంలో పాలుపంచుకు న్నాయి. ఈ ఉద్యమం ఆంధ్ర మహా సభ, కమ్యునిస్టుల రూపకల్పన. మార్షల్ లా ఈ ప్రాంతంలో 1946 నుండి ప్రాబల్యంలో ఉంది.చాల మంది ప్రజలు భూస్వామ్య ప్రభువుల సైన్యం రజాకార్ల చేతులలో ప్రాణాలు కోల్పోయారు. నిజాం సైన్యం కూడా ఈ రెండు జిల్లాలలో ఈ ఉద్యమ మద్దతుదారులను అనేక మంది చంపి విధ్వంసం సృష్టించింది. ఫలితంగా 3000-5000 గ్రామాలను స్వతంత్రం చేసి, ఒక్కొ గ్రామానికి నాయకులను నియమించారు.  భూస్వామ్య ప్రభువుల నుండి భూమిని స్వాదీనం చేసుకొని అవసరమైన, వ్యవసాయం చేసే ప్రజానీకానికి పంచారు. ఈ యుద్ధం చివరకు భారత బలగాలచే అంతమొందించబడి, భారత యూనియన్లో హైదరాబాద్ ప్రాంతంతో బాటుగా నల్లగొండ, వరంగల్ జిల్లాలు భాగమయ్యాయి.

పర్యాటక ఆకర్షణలు

ప్రస్తుతం, నల్గొండ ఆంధ్రప్రదేశ్ లో పర్యాటక కోణం దృష్ట్యా ఒక ముఖ్య భాగం. కారణం నల్గొండకు వాటిపై ఆధారపడే ఏ విధమైన ఇతర ప్రధాన వ్యాపారాలు లేకపోవడం వలన ఆర్ధిక వనరులు ప్రధాన౦గా పర్యాటక రంగం నుండే లభిస్తాయి. మట్టపల్లి, పిల్లలమర్రి, రాజీవ్ పార్క్, ఫణిగిరి బౌద్ధ స్థలాలు, పానగల్ దేవాలయం, నందికొండ, లతీఫ్ షాహ దర్గా, కొల్లంపాకు జైన దేవాలయం, రాచకొండ కోట, మేళ్ళచెర్వు, దేవరకొండ కోట, భువనగిరి కోట నల్గొండ లోని కొన్ని చూడదగిన ఆసక్తికర ప్రాంతాలు. ఈ అన్ని ప్రాంతాలు నల్గొండ చరిత్రలో చాల ప్రాముఖ్యతను కల్గి ఉన్నాయి.
ఈ ప్రాంతం ఏ జాతీయ రహదారి పైన నేరుగా కలవనప్పటికి నల్గొండ కు రైళ్ళు, రోడ్డు మార్గాల ద్వారా చేరడం సులువు. నల్గొండ రైలు స్టేషన్ గుంటూరు – సికింద్రాబాద్  రైల్వే లైన్ పై ముఖ్య మైనది, ఈ పట్టణంలో ఆగే అనేక రైళ్ళు ఉన్నాయి. రోడ్డు రవాణా వ్యవస్థ కూడా బాగుండటమే కాక చాల బస్సులు తరుచుగా నల్గొండ కు వస్తు, పోతూ ఉంటాయి. దగ్గరి విమానాశ్రయం హైదరాబాద్.
ఈ ప్రాంతం ఉష్ణమండల వాతావరణంతో కూడిన తీవ్రమైన పొడి, వేడి వాతావరణాన్ని కల్గి ఉంటుంది. నల్గొండ వర్షాకాలంలో సగటు వర్షపాతాన్ని నమోదు చేసుకొంటుంది, శీతాకాలాలు కొంత చలిగా ఉంటాయి. శీతాకాలంలో మధ్యాహ్న సమయంలో సూర్యకిరణాల ప్రభావం సాయంత్రానికి తగ్గి, సాయంత్రం నుండి రాత్రి వరకు ఆహ్లాదకరం ఉంటుంది కనుక ప్రజలు ఈ సమయంలో నల్గొండ సందర్శనకు ప్రాధాన్యతను ఇస్తారు.

Comments