బిర్లా మందిర్, హైదరాబాద్
బిర్లా ప్లానిటోరియం కి పక్కన ఉన్న మరొక విశేషం బిర్లా మందిర్. నౌబథ్ పహాడ్ అనబడే చిన్న కొండ మీద నిర్మించబడిన మందిరం ఈ బిర్లా మందిర్. హిందువులకి ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి భక్తులకి ఈ ఆలయం విశిష్టమైనది. రామకృష్ణ మిషన్ తరపున స్వామి రంగనాధానంద గారి చేత ప్రారంభించబడిన ఈ మందిరం కట్టించడానికి 10 సంవత్సరాలు పట్టింది.
రాజస్థాన్ నుండి తెప్పించిన తెల్లటి చలువ రాతి తో కట్టబడడం ఈ మందిరం యొక్క విశేషం. ఈ గుడిలో ప్రశాంతతకి భంగంకలగ కూడదని గంటలు కూడా ఉండవు. మూల విరాట్ వెంకటేశ్వర స్వామి తో పాటు ఇంకా ఇతర దేవుళ్ళు కూడా ఇక్కడ కొలువై ఉన్నారు. ఈ గుడిలో శివుడు, గణపతి, హనుమంతుడు, బ్రహ్మ, సాయిబాబా, శక్తి, లక్ష్మి ఇంకా సరస్వతి ల కు ప్రత్యేక మందిరాలు ఉన్నాయి. ఇక్కడి గోడలపై గురు గోబింద్ సింగ్ వంటి మహనీయుల పవిత్రమైన బోధనలు గమనించవచ్చు.
Comments
Post a Comment