చిల్కూర్ బాలాజీ టెంపుల్, హైదరాబాద్
వీసా బాలాజీ టెంపుల్ లేదా వీసా బాలాజీ దేవునిగా ప్రసిద్ది చెందినది హైదరాబాద్ లో ఉన్న చిల్కూర్ బాలాజీ టెంపుల్. శ్రీ వెంకటేశ్వర స్వామీ కి అలాగే వారి భార్యలైన శ్రీ దేవి, భూ దేవి లకి అంకితమివ్వబడినది ఈ చిల్కూరు బాలాజీ టెంపుల్. డబ్బులు అంగీకరించని ఏకైక ఆలయంగా ప్రపంచవ్యాప్తంగా ఈ గుడి ప్రాచుర్యం పొందింది.
నిజానికి ఈ గుడిలో ఎటువంటి హుండీలు ఉండవు. దేవుని దృష్టిలో అందరూ సమానం. అందుకనే ఈ గుడిలో ప్రముఖులకి ఎటువంటి ప్రత్యేక సౌకర్యాలు ఉండవు. ఈ ఆలయం కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యం లో లేదు. ఈ ఆలయ నిర్మాణ శైలిని అధ్యయనం చేసిన తరువాత ఈ ఆలయం దాదాపు అయిదు వందల ఏళ్ల పూర్వానిదని నమ్మకం.
ఒస్మాన్ సాగర్ సరస్సు ఒడ్డున ఉన్న అందంగా ఉన్న ఈ ఆలయం, మెహిదీపట్నం నుండి 33 కిలోమీటర్ల దూరంలో ఉంది. విలక్షణమైన నిర్వహణా శైలి వల్ల ఈ ఆలయానికి వేలమంది పర్యాటకులు ప్రతి సంవత్సరం తరలి వస్తారు.
Comments
Post a Comment