హైటెక్ సిటీ, హైదరాబాద్
హైదరాబాద్ లో ఉన్న హైటెక్ సిటీ లేదా హైదరాబాద్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ ఒక టౌన్షిప్ ప్రాంతం. మాదాపూర్ మరియు గచ్చిబౌలి శివార్లకి ఈ టౌన్ షిప్ ప్రాంతం అత్యంత సమీపంలో ఉంది. ఈ మిలీనియం ప్రారంభంలో భారత దేశపు ఐటి కేంద్రంగా బెంగళూర్ ఉద్భవించిన తరువాత అప్పటి ముఖ్యమంత్రి చందరబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ కే ప్రధాన ఐటి కేంద్రంగా హైదరాబాద్ నగరాన్నితీర్చిదిద్దాలనుకున్నారు.
అత్యుత్తమ మౌలిక సదుపాయాలని కలిగిస్తూ ఎన్నో ఐటి కంపెనీలని హైదరాబాద్ నగరానికి ఆహ్వానించారు. సైబర్ టవర్స్ ఈ హైటెక్ సిటీ ప్రాజెక్ట్ లో మొదటి దశ, అలాగే సైబర్ గేట్ వే రెండవ దశ. జి ఇ కాపిటల్ ఇంకా ఒరాకిల్ కార్పొరేషన్ వంటి ఎన్నో బహుళ జాతి సంస్థల ఆఫీసులు ఈ సైబర్ టవర్స్ లో ఉన్నాయి.
సత్యం కంప్యూటర్స్, విప్రో, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, మైండ్ స్పేస్, మరియు ఎల్ అండ్ టి, ఇన్ఫోసిస్, ఎపిఐఐసి, ఐబియం, గూగుల్ వంటి ఎన్నో కంపెనీ లు ఈ హైటెక్ సిటీ లేదా సైబర్ సిటీ లో ఉన్నాయి. ఇన్ఫోసిస్ వంటి ఎన్నో ప్రముఖమైన కంపెనీ లు వాటి యొక్క రోజు వారి అవసారాలకు తగినట్టుగా సెల్ఫ్ సఫిషియంట్ కాంపస్ లని ఏర్పాటు చేసుకున్నాయి.
Comments
Post a Comment