హుస్సేన్ సాగర్ లేక్, హైదరాబాద్
హైదరాబాద్ యొక్క చరిత్రలో మరియు భౌగోళిక ప్రాంతంలో ఒక మైలురాయి వంటిది ఈ హుస్సేన్ సాగర్ చెరువు. 1562 లో ఈ మానవ నిర్మిత చెరువుని హజ్రత్ హుస్సేన్ షా వాలి నిర్మించారు. మూసీ నదికి అనుబంధంగా ఈ చెరువు నిర్మించబడినది. ఈ చెరువుని నిర్మించడంలో ముఖ్య ఉద్దేశం ఈ నగరానికి సాగు నీరు అందించడం.
ఆ అతిపెద్ద చెరువు ఎల్లప్పుడూ నీటితో నిండి ఉండి సికింద్రాబాద్ మరియు హైదరాబాద్ జంట నగరాలను కలుపుతూ ఉంటుంది. ఈ చెరువు చుట్టూ నిర్మితమైన నెక్లస్ రోడ్డు రాత్రి పూట లైట్లతో వజ్రాలు పొదగబడిన నెక్లస్ లాగా మెరుస్తూ ఉంటుంది. నెక్లస్ రోడ్డు మరియు హుస్సేన్ సాగర్ చెరువు కలిసి మనోహరంగా రాత్రి పూట కనిపిస్తాయి.
ఏక శిలా విగ్రహమైన బుద్ధుని విగ్రహం 1992 ఈ హుస్సేన్ సాగర్ చెరువు మధ్యలో ప్రతిష్టించారు. పడవ ద్వారా ఈవిగ్రహం ఉన్న ప్రదేశానికి చేరుకోవచ్చు. హైదరాబాద్ లో ఉన్నప్పుడు తప్పని సరిగా చూడవలసిన ఆకర్షణలలో ఒకటి ఈ ప్రదేశం.
Comments
Post a Comment