Falaknuma palace Hydarabad ( telanagana tourisum )


ఫలక్నామా పాలస్, హైదరాబాద్




   ఆంగ్ల నిర్మాణ శిల్పి చేత రూపొందించబడినది ఈ ఫలక్నామా పాలసు. ఈ పాలసు నిర్మాణం      1884 లో ప్రారంభం అయింది. మొదటగా ఈ పాలసు హైదరాబాద్ కి అప్పటి ప్రధాన మంత్రి      అయిన నవాబ్ వికర్-ఉల్-ఉమ్రా కి చెందినది. ఆ తరువాత నిజాముల చేతికి ఇవ్వబడినది.      "ఆకాశం యొక్క అద్దం" అని అర్ధం వచ్చే ఈ పాలస్ పేరు ఉర్దూ పదం నుండి వచ్చింది.













చార్మినార్ నుండి అయిదు కిలోమీటర్ల దూరం లో ఉన్న ఈ పాలసు కి రోడ్డు మార్గం ద్వారా చాలా సులభంగా చేరుకోవచ్చు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ పాలసు ఆకృతి ఒక తేలు ఆకారాన్ని పోలి ఉంటుంది. తేలు కున్న రెండు కొండిలు ఉత్తరం వైపు పొడిగించబడినవి. తేలు ఆకారాన్ని పోలి ఉన్న ఈ పాలసు మధ్య భాగం లో ప్రధాన భవనం అలాగే వంటశాల ఉన్నాయి.
ఈ పాలసు దక్షిణ భాగంలో జీనన మహల్ అలాగే హరేం లు ఉన్నాయి. ట్యూడర్ ఇంకా ఇటాలియన్ సంస్కృతిల నిర్మాణ శైలి ఈ పాలసు లో గమనించవచ్చు. ఈ పాలసు యొక్క కిటికీ ల కి ఉపయోగించిన గాజు ట్యూడర్ శైలి ని దృష్టిలో పెట్టుకుని ఏర్పాటు చేసినది.


Comments