Telangana Attractions Nagarjuna sagar full view




నాగార్జునసాగర్: బౌద్ధుల యొక్క పట్టణం




నాగార్జునసాగర్, ప్రపంచంలో ఉన్న బౌద్ధులకు ముఖ్యమైన స్థలము. ఇది దక్షిణ భారత రాష్ట్రమైన ఆంద్రప్రదేశ్ లో ఒక చిన్న పట్టణంగా ప్రసిద్ధి చెందింది. ఒక పవిత్రమైన స్థలంగా ప్రసిద్ధి చెందుతూ అదే విధంగా ఒక ముఖ్యమైన పర్యాటక స్థలంగా కూడా ప్రసిద్ధి చెందుతూ ఉంది.

పురాతన రోజుల్లో దీనిని విజయపురి అని కూడా పిలిచేవారు.కాలక్రమేణ ఒక బౌద్ధ భక్తుడు నాగార్జున పేరుతొ ఈ పట్టణం యొక్క పేరు ఏర్పడింది. ఆయన భగవత్స్వరూపమైన బుద్ధుడికి ఒక గొప్ప ఆరాధ్య భక్తుడే కాదు అక్కడి ప్రజలచేత కూడా కీర్తించపడ్డాడు. అతను మొదటి శతాబ్దం ఏ.డి. చివరి వరకు,అంటే 60 సంవత్సరాల వరకు బుద్ధుల సంఘ నాయకుడిగా ఉన్నారు. దీనివలన దక్షిణ భారతంలో సహస్రాబ్ది ప్రారంభ కాలము నుండే ఇది ఒక ముఖ్యమైన బౌద్ధుల పవిత్రమైన స్థలంగా ఉందని తెలుస్తుంది.
పురాతన తవ్వకాలలో ఈ ప్రాంతంలో బౌద్ధ మతం ప్రసిద్ధి చెందినట్లుగా సాక్ష్యాధారాలు కనిపించాయి. ఈ ఆధారాలు అన్నీ స్తూపాలు మరియు శిల్పాల రూపంలో బుద్ధుడి జీవిత చరిత్ర గురించి, అతనియొక్క బోధనల గురించి ఉన్నాయి. ఈ సాక్ష్యాధారాలవలన నాగార్జునసాగర్ ఒక ముఖ్యమైన పురావస్తు స్థలంగా కూడా పేరు పొందింది.
నాగార్జునసాగరులో పర్యాటకులు చూడవలసిన స్థలాల్లో ముఖ్యమైనవి నాగార్జునసాగర్ డాం, ఎత్తి పోతల జలపాతాలు మరియు నాగార్జునకొండ ఉన్నాయి. ఈ పట్టణం ఆంధ్రప్రదేశ్ రాజధాని అయిన హైదరాబాద్ నగరానికి 150 కి.మీ.దూరంలో ఉన్నది. హైదరాబాద్ నుండి ఈ పట్టణాన్ని రోడ్ ద్వారా సులభంగా చేరుకోవచ్చు. నాగార్జునసాగర్ చేరుకోవటానికి అనేక బస్సు సర్వీసులు పెద్ద నగరాలనుండి మరియు పట్టణాలనుండి నడుపబడుతున్నాయి. బస్సు ప్రయాణం ఉత్తమం ఎందుకంటె ఈ పట్టణానికి చేరుకోవాలంటే అక్కడ రైల్వే స్టేషన్ కాని, విమానాశ్రయం కాని లేవు.
నాగార్జునసాగర్ సందర్శించటానికి శీతాకాలం బాగుంటుంది. ఎందుకంటే ఉష్ణమండల వాతావరణ పరిస్థితుల మూలంగా, వేసవిలో అతివేడి, చలికాలంలో కొద్ది చలి ఉంటుంది.


Comments