Telangana Attractions Medak full view


మెదక్ – ప్రతి రోజూ పండగే  !



తెలంగాణ లోని మెదక్ జిల్లాలో మెదక్ ఒక పురపాలక సంఘం పట్టణం. ఇది రాజధాని నగరం హైదరాబాద్ కు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. మెదక్ కు సంబంధించి చాల ఆసక్తికరమైన చరిత్ర ఉంది. అసలు పేరు సిద్దాపురం కాగా తర్వాతి కాలంలో గుల్షనాబాద్ గా మారిందని విశ్వసిస్తారు. కాకతీయ వంశ పాలనలో ఈ పట్టణం ఎంతో పురోగతిని సాధించింది. వాస్తవానికి కాకతీయల రాజు ప్రతాప రుద్రుడు మెదక్ ను ఎటువంటి దాడుల నుండి అయిన సంరక్షించడానికి చుట్టూ ఒక కోట ప్రహరిను నిర్మించాడు. మెతుకుదుర్గం అనే ఈ కోట ప్రహరిని చిన్న కొండ మీద నిర్మించారు. స్థానికులలో మెతుకుసీమగా ఇది ప్రసిద్ది చెందింది. మెతుకు అంటే వండిన బియ్యపు గింజ అని తెలుగులో అర్ధం.


బతుకమ్మ పండుగ, శరదృతువు పండుగ

ఎంతో ఆనందోత్సాహాలతో ఇక్కడ జరుపుకొనే అనేక పండుగల వలన మెదక్ పరిసరాలలోని పట్టణాలు, నగరాలలో చాల ప్రసిద్ది చెందింది. వాస్తవానికి ఆంధ్ర ప్రదేశ్ లోని అన్ని పండుగలను ఈ ప్రాంతంలో జరుపుకొంటారు, చాలామంది ప్రజలు దూరప్రాంతాల నుండి విస్తృతంగా ఈ పండుగలలో పాల్గొనడానికి వస్తారు. పెద్ద సంఖ్యలో జరుపుకొనే బతుకమ్మ పండుగ ఈ పట్టణంలో చాల ప్రసిద్ధ పండుగ. తెలంగాణా ప్రాంతానికి చెందిన ఈ పండుగను కేవలం స్త్రీలు మాత్రమే జరుపుకొంటారు. గౌరీ దేవిని పూజించే ఈ పండుగను నవరాత్రి సమయంలో జరుపుకొంటారు. తెలంగాణా ప్రాంతంలో ఈ దేవతను బతుకమ్మగా పూజిస్తారు. ఈ పదానికి అర్ధం వాస్తవానికి సజీవంగా రమ్మని దేవతను ఆహ్వానించడం. బతుకమ్మ పండుగ శరదృతువులో తొమ్మిది రోజుల పాటు జరుగుతుంది. దసరాకు ఒక రోజు ముందు ఈ ఉత్సవాలు సమాప్తమౌతాయి.

మెదక్ లో చుట్టుపక్కల చూడదగిన ప్రదేశాలు

మెదక్ చాల ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం కూడా అవడంతో ఈ పట్టణానికి అనేక మంది ప్రజలు ప్రక్క రాష్ట్రాల నుండి వస్తారు. సాయిబాబా భక్తులు నిర్మించిన ఒక దేవాలయం ఈ పట్టణంలో ఉంది. మెదక్ దగ్గరలో చిన్న గ్రామం గొట్టం గుట్టలో ఒక అందమైన సరస్సు, అనేక అందమైన దేవాలయాలు ఉన్నాయి. పక్షులు, వన్య మృగాలు ఉండే పోచారం అడవి, వన్యప్రాణి అభయారణ్య౦ యువ పర్యాటకులలో ఎంతో ప్రసిద్ది, కాని ఒకప్పుడు హైదరాబాద్ నిజాం నవాబులకు ఇది వేటాడే ప్రదేశంగా ఉపయోగపడేది.
చాల ప్రసిద్ది చెందిన వేరొక పర్యాటక కేంద్రం సింగూర్ డాం, ఇది స్థానిక ప్రజలకు విహారయాత్రకు ప్రసిద్ధ కేంద్రం. మెదక్ పట్టణానికి అతి దగ్గరలో ఉండటం వలన నిజాంసాగర్ డామ్ కూడా తరుచుగా సందర్శించే విహార యాత్ర కేంద్రం. ఈ డామ్ ను మంజీరా నది పై నిర్మించారు. మంజీర వన్యప్రాణి, పక్షుల అభయారణ్యం మెదక్ పట్టణానికి చాల దగ్గరలో ఉంది. ఈ ప్రాంతం మొసళ్ళకు దేశంలోనే ప్రసిద్ది. ఈ అభయారణ్య౦ అనేక వలస పక్షులకు నివాసం, సీజన్లో సందర్శిస్తే మీరు వీటిలో అనేక రకాలను చూడవచ్చు.

మెదక్ పర్యటనకు ఆహ్వానించే పండుగలు

మెదక్ లో చుట్టుపక్కల అనేక చారిత్రిక దేవాలయాలు ఉన్నాయి. వీటిలో శ్రీ సరస్వతి క్షేత్ర దేవాలయం, వేలుపుగొండ శ్రీ తు౦బురనాథ దేవాలయం, ఏడుపాయల దుర్గాభవాని గుడి ఎంతో ప్రసిద్ది. పెద్ద సంఖ్యలో పర్యాటకులు మెదక్ పట్టణానికి విచ్చేయడానికి ఈ దేవాలయాలు ఒక కారణం. పండుగల సమయంలో పోటెత్తే లెక్కలేనంత మంది భక్తులు, పర్యాటకులకు వసతి సౌకర్యాలు కల్పించే పనిలో ఈ పట్టణం సతమతమౌతుంది. ఈ పట్టణంలో హిందువుల జనాభా ఎక్కువైనప్పటికీ అన్ని పండుగలను అదే విధమైన భక్తి, ఆరాధనతో జరుపుకొంటారు. ఈ పట్టణం ఒక ప్రముఖ పర్యాటక కేంద్రం కావడం ఒక చిన్న అద్భుతంగా ఉంటుంది.

Comments