Telangana Attractions Warangal full view


వరంగల్: చారిత్రాత్మక ప్రాధాన్యత కల అద్భుతమైన ప్రదేశం


వరంగల్ భారతదేశంలో తెలంగాణా  రాష్ట్రంలో ఉన్న ఒక జిల్లా మరియు 12-14 వ శతాబ్దం A.D. నుండి పాలించిన కాకతీయ రాజుల రాజధానిగా ఉండెను. ఇది రాష్ట్రంలో ఒక పెద్ద నగరం. పురాతన కాలంలో వరంగల్ను 'ఓరుగల్లు' లేదా 'ఓంటికొండ' అని కూడా  పిలిచేవారని దీనికి సాక్ష్యాధారంగా  ఒక పెద్ద కొండ రాయిమీద ఈ పేర్లు చెక్కి ఉండటం కనిపిస్తుంది. వరంగల్ నగరం వరంగల్ జిల్లాలో ఉంది,దీనితోపాటుగా హన్మకొండ మరియు కాజీపేట్ కూడా ఉన్నాయ్.



వరంగల్ కోట వంటి వివిధ వాస్తుకళా కళాఖండాలు పర్యాటకులకు ప్రధాన ఆకర్షణలుగా ఉన్నాయి మరియు ప్రోల రాజు  (కాకతీయ వంశం యొక్క) ఈ సుందరమైన నగరం నిర్మించారు అని నమ్ముతారు. మార్కో పోలో, ప్రఖ్యాత ఇటాలియన్ యాత్రికుడు, అతని ప్రయాణ డైరీలలో మరియు ఆయన రచనల్లో వరంగల్ గురించి ప్రస్తావించినప్పుడు కాకతీయరాజుల సాంస్కృతిక మరియు పరిపాలన దక్షత గొప్పతనం ప్రతిబింబిస్తాయి.
వరంగల్ ప్రధానంగా వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ కలిగిఉన్నది మరియు మిరప, పొగాకు, పత్తి, బియ్యం పంటలు ఇక్కడ విస్తృతంగా సాగు చేస్తారు. ఈ నగరంలో కేవలం ఒక మిలియన్ మంది పౌరులు నివసిస్తున్నారు.

చరిత్రపరంగా

ఇంతకు ముందు చెప్పినట్లుగా కాకతీయ రాజులు 12నుండి14వ శతాబ్దం A.D.వరకు వరంగల్ పరిపాలించారు. ప్రతాప రుద్ర యొక్క ఓటమి తరువాత, ముసున్రి నాయక్ ల యాభై సంవత్సరాల చట్టం స్థాపించబడింది. దీనివలన వివిధ నాయక్ రాజుల మధ్య నమ్మకం, సంఘీభావం లేకపోవడం, పరస్పర పోటీ ఏర్పడ్డాయి మరియు నగరం యొక్క పరిపాలనా నియంత్రణను బహమనీలు తీసుకున్నారు.
ఔరంగజేబు, మొఘల్ చక్రవర్తి, 1687 సంవత్సరం లో గోల్ద్కండా సుల్తానేట్ మీద విజయం సాధించాడు. (వరంగల్ ఒక భాగమై ఉంది ) మరియు 1724 వరకు అలానే కొనసాగింది. హైదరాబాద్ స్టేట్ 1724 లో ఉనికిలోకి వచ్చింది మరియు1948 లో వరంగల్ కూడా  మహారాష్ట్ర, కర్ణాటక కొన్ని ప్రాంతాలతో పాటు ఒక  భాగం అయ్యింది. హైదరాబాద్ భారతీయ రాష్ట్రం అయింది మరియు 1956 లో ఈ రాష్ట్రానికి ప్రధానంగా తెలుగు మాట్లాడే ప్రాంతాలను ఇచ్చివేశారు 
వరంగల్ లో సేకరించిన సాక్ష్యాధారాలననుసరించి 12వ శతాబ్దానికి ముందు 'కాకతిపుర' (కాకతీయ రాజుల నుంచి వొచ్చింది) అని వరంగల్ను ప్రత్యామ్నాయంగా పిలిచేవారని అనుకోవొచ్చు.
చుట్టుప్రక్కల ప్రాంతాలు
వరంగల్ నగరానికి గల చారిత్రక ప్రాధాన్యత, అనేక రకాల శిల్పకళ, అభయారణ్యాలు మరియు ఆకట్టుకొనే విధంగా ఉన్న దేవాలయాలు ఇలా అనేక రకాల కారణాల వల్ల ఏడాది పొడవునా పర్యాటకులు  పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు.
పాకాల సరస్సు,వరంగల్ కోట,వేయి స్తంభాల గుడి మరియు రాక్ గార్డెన్ మొదలైన ఆకర్షణలను వరంగల్ జిల్లాలో చూడవచ్చు. ఇతర దేవాలయాలు,పద్మాక్షి ఆలయం మరియు భద్రకాళి ఆలయం సమాజంలోని అన్నిరకాల భక్తులను ఆకర్షిస్తూన్నాయి. వరంగల్ ప్లానిటోరియం పర్యాటకులకు ప్రధాన ఆకర్షణగా ఉన్నది. ఇక్కడ ఇంకా అనేక సరస్సులు,ఉద్యానవనాలు ఉన్నాయి.   
వరంగల్ లో రెండు సంవత్సరాలకి ఒకసారి సమ్మక్క-సారక్క జాతర (సమ్మక సారలమ్మ జాతర అని కూడా అంటారు) జరుగుతుంది. ఈ జాతర పది మిల్లియన్ల ప్రజలను ఆకర్షిస్తున్నది. కాకతీయ రాజ్యంలో అమలుపరిచిన అన్యాయమైన చట్టాలను ఎదిరిస్తూ ఒక తల్లి-కూతురు జరిపిన పోరాటాన్ని గుర్తు చేసుకుంటూ ఈ పండుగ (జాతర)ను జరుపుకుంటారు.  కుంభమేళా తరువాత ఆసియ ఖండంలో రెండవ అతిపెద్ద జాతర ఇది.
ఇక్కడ బతుకమ్మ పండుగను ఒక గొప్ప శైలిలో జరుపుకుంటారు మరియు స్త్రీలు పూలన్నిటినీ కలగలుపు చేసి దేవతను పూజిస్తారు.

ప్రయాణం మరియు వసతి

గవర్నమెంట్ బస్సు సర్వీసులు నగరం అంతటా ఉన్నాయి మరియు అందులో ప్రయాణం కనీస ఖర్చుతో కూడుకున్నది మరియు అన్ని స్థలాలిని పర్యటించవొచ్చు. ఈ నగరంలో ఆటోరిక్షాలు కూడా చాలా చూడవొచ్చు మరియు ప్రయాణ సౌకర్యాల గురించి ఎక్కువగా ఆలోచించనక్కరలేదు.ఆటోరిక్షాలు మీటర్ మీద నడవవు,కాబట్టి ప్రయాణానికి ముందే రేటు నిశ్చయించుకొని, నిశ్చింతగా ప్రయానించవొచ్చు.
వరంగల్ నగరం ఎక్కువ ప్రజాదరణ పొందటం వలన పర్యాటకుల సంఖ్య ఎక్కువగా ఉండటం వలన నగరంలో వసతి కొద్దిగా కష్టంగానే ఉంటుంది, ముందుగానే వసతిని చూసుకోకపోతే. మధ్యతరగతి హోటళ్ళు గదికి రూ.750 చొప్పున ఏదాది పొడుగునా దొరుకుతాయి. అయినప్పటికీ, ఎండాకాలంలో ఈ గదులు తీసుకోవటం మంచిది కాదు ఎందుకంటే వరంగల్లులో అపరిమితమైన వేడి ఉంటుంది. డీలక్స్ గదికి (ఎయిర్-కండిషన్ తో) రోజుకు సుమారు రూ.1200 చొప్పున దొరుకుతాయి మరియు ఇటువంటి సౌకర్యాలు చాలా వరంగల్ కోట పరిసరాలలో కనిపిస్తాయి. ఎవరైతే రోజుకు 3000-4000 ఖర్చు పెట్టటానికి సిద్ధంగా ఉన్నారో వారికి లగ్జరీ రిసార్ట్స్ ప్రత్యామ్నాయంగా దొరుకుతాయి. ఇంటర్నెట్ యాక్సెస్, ఒక ఈత కొలను మరియు రెస్టారెంట్లో ఉండే బహుళ వంటకాలు వంటి సౌకర్యాలతో ఈ  లగ్జరీ రిసార్ట్స్ ఉంటాయి.

Comments