Botanical Garden Hydarabad


హైదరాబాద్ బొటనికల్ గార్డెన్స్, హైదరాబాద్


కోట్ల విజయభాస్కర రెడ్డి బొటానికల్ గార్డెన్ గా పేరుగన్న హైదరాబాద్ బొటనికల్ గార్డెన్స్ హైదరాబాద్ లో ని మరి యొక ప్రత్యేక ఆకర్షణ. హైదరాబాద్ రైల్వే స్టేషన్ నుండి 16 కిలో మీటర్ల దూరంలో హైటెక్ సిటీ కి దగ్గరలో ఈ గార్డెన్ ఉంది. హైదరాబాద్-ముంబై ముఖ్య రహదారిపై ఈ గార్డెన్ ఉంది. బీజద్రవ్యం యొక్క అభివృద్ధి మరియు పరిరక్షణ ఈ బొటనికల్ గార్డెన్ ముఖ్య ఉద్దేశం.

అత్యాధునిక సాంకేతిక పరికరాలతో గాడ్జెట్ లతో ఈ గార్డెన్ ని తీర్చిదిద్దారు. వృక్షజాలం మరియు జంతుజాలాన్ని పరిరక్షించడంతో పాటు ప్రకృతిని కాపాడాలనే సద్భావాన్నిఈ గార్డెన్ బోధిస్తుంది. ప్రస్తుతం, ఈ గార్డెన్ లో ని అయిదు విభాగాలని సందర్శకులకు అందుబాటు లో ఉంచారు.
పెరటి ఔషద మొక్కలు, ఆర్నమెంటల్ ప్లాంట్స్, అక్వాటిక్ ప్లాంట్స్, కలప మొక్కలు, వెదురు మొక్కలు, పళ్ళ చెట్లు ఇంకా ఎన్నో ఈ విభాగాలలోకి వస్తాయి. పర్యావరణవేత్త కాకపోయినా అందంగా నిర్మించబడిన ఈ గార్డెన్ ని చూడడానికి పర్యటించవచ్చు. ఇక్కడ అందమైన పచ్చిక బయళ్ళు నీటి చెలమలు చిన్న చిన్న కొండలు పర్యాటకులు చూసి సంతోషించవచ్చు.




















Comments